Saturday, 22 August 2015

హైదరాబాద్ బస్టాండ్లలోనూ ‘వైఫై’


మొదటి అరగంట ఉచితం..తర్వాత గంటకు రూ.10
రైల్వే స్టేషన్లలో ప్రారంభమైన వైఫై సేవలు ఇకనుంచి బస్టాండ్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్టాండ్లలోనూ వైఫై సేవలను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా జిల్లా కేంద్రాల్లో వచ్చే నెల మొదటి వారంనాటికి వైఎఫ్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో.. ఎంజీబీఎస్‌తోపాటు మెదక్‌ జిల్లా పటాన్‌చెరు బస్టాండుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా కేంద్రాలతోపాటు.. భద్రాచలం, కొత్తగూడెం, సిద్దిపేట, మంచిర్యాల, ఆర్మూర్‌, కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట, కామారెడ్డి, నిర్మల్‌, మెదక్‌, సంగారెడ్డి, జడ్చర్ల, నాగర్‌కర్నూలు వంటి ప్రధాన పట్టణాల్లోని బస్టాండ్లలో కూడా వైఎఫ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ వైఎఫ్‌ సేవలను మరింత స్పీడ్ గా..నాణ్యతతో అందించే విధంగా ‘5జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగించుకోనుంది.

వైఎఫ్‌ సేవలను మొదటి అరగంటపాటు ఉచితంగా ఇవ్వాలని.. ఆ తర్వాత గంటకు రూ.10 చొప్పున యూజర్‌ ఛార్జీలను వసూలు చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ డిసైడ్ అయ్యింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ లో మెట్రో సర్వీసుల ఇన్ఫర్మేషన్ తెలుసుకునేలా ఈ యాప్‌ ను మరో రెండు రోజుల్లోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
Author Nethi Karthik

No comments:

Post a Comment