మీరెప్పుడైనా విమానం ఎక్కారా? పోనీ విమానాలను దగ్గర నుండి ఎప్పుడైనా చూశారా? అయితే వాటి కిటికీలను గమనించారా? ఏ కిటికీ అయినా చతురస్రాకారమో, లేక దీర్ఘచతురస్రాకారాల్లోనో ఉంటాయ్, మరి అదేంటీ…? విమాన అద్దాలు గోళాకారంలోఉ న్నాయ్ అని డౌట్ వచ్చిందా.? బస్, ట్రైన్ వీటన్నింటికీ ఇలాంటి కిటికీలు ఉండి విమానానికి అలాంటి కిటికీ ఉండడం వెనుక కిటుకేంటో తెలుసా?
విమానాలకు గోళాకారమైన అద్దాలను వాడతారు.! ఎందుకంటే విమానం
గాలిలోకి ఎగిరినప్పుడు మాములుగా వాతావరణ ఒత్తిడి తీవ్రంగా తగ్గిపోతుంది, చతురస్త్రాకార
అద్దాలను ఉపయోగించడం వలన విమానం లోపల ఒత్తిడి పెరిగి ఆ విమానం కుప్పకూలిపోయే
ప్రమాదం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అద్దాలను చతురస్త్రాకారంలో విమానాలకు వాడటం
కారణంగా, అటువంటి అద్దాలు చుట్టూ నాలుగు వైపుల ప్రదేశాలు బలహీనంగా ఉండటం
వలన ఒత్తిడి పెరిగి కుప్పకూలిపోయాయట. అదే గోళాకారమైన అద్దాలను ఉపయోగించడం ద్వారా
ఇంటర్నల్ ప్రెజర్ అన్నివైపులా ఒకేలా ప్రవేశించడంతో విమానంపై ఎటువంటి స్ట్రెస్, స్ట్రైన్
పడకుండా, ప్రమాదాలు జరగకుండా అడ్డుగా నిలుస్తాయట. ఆ కారణం చేతనే విమానాల
అద్దాలను గోళాకారంగా ఉండేలా రూపొందిస్తారట. –
గాలిలో ప్రయాణించే ఏ వస్తువు మీదైనా ప్రధానంగా నాలుగు బలాలు పని
చేస్తాయని శాస్త్రజ్ఞుడు జార్జి కేలీ సూత్రీకరించాడు.
1)గురుత్వాకర్షణ శక్తి:
పైన ప్రయాణిస్తుండే వస్తువును
నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి అదే దాని బరువు.భౌతిక శాస్త్రంలో
దీనినే భారము అని అంటారు.చ W=mg (w=భారము;m=ద్రవ్యరాశి;g=గురుత్వాకర్షణ శక్తి)
2) లిప్ట్
ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు
పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే
లిఫ్ట్. విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. దాని బరువుకు వ్యతిరేకంగా బరువు కంటే
ఎక్కువగా పని చేస్తున్నపుడే అది తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ బలాన్ని
రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని
మార్చడం ద్వారా ఈ లిఫ్ట్ బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్
సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం
పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
3) థస్ట్: విమానాన్ని బలంగా ముందుకు లాక్కుపోతుండే బలం… థ్రస్ట్.
4) ఢ్రాగ్:
విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి
నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
ఇదే సమయంలో ఆ ఎదురు గాలి
సృష్టించే అవరోధం నాలుగోది. అదే డ్రాగ్. ఈ డ్రాగ్ కంటే కూడా దాన్ని ముందుకు లాగే
బలం (థ్రస్ట్) ఎక్కువగా ఉంటేనే విమానం ముందుకు సాగిపోతుంది.
పైన ప్రయాణిస్తుండే వస్తువును నిరంతరం కిందకు లాగుతుండే గురుత్వాకర్షణ శక్తి అదే దాని బరువు.భౌతిక శాస్త్రంలో దీనినే భారము అని అంటారు.చ W=mg (w=భారము;m=ద్రవ్యరాశి;g=గురుత్వాకర్షణ శక్తి)
2) లిప్ట్
ఈ బరువుకు వ్యతిరేకంగా అది కిందకు పడిపోకుండా నిరంతరం దాన్ని పైకి లేపుతూ అది తేలుతూ ఉండేలా చూసే బలం రెండోది. అదే లిఫ్ట్. విమాన యానానికి అత్యంత కీలకమైన బలం. దాని బరువుకు వ్యతిరేకంగా బరువు కంటే ఎక్కువగా పని చేస్తున్నపుడే అది తేలుతుంది. పైపైకి లేస్తుంటుంది. ఈ బలాన్ని రెక్కలు సృష్టించాలి. విమానం చలన వేగాన్ని పెంచడం ద్వారా లేదా రెక్కల కోణాన్ని మార్చడం ద్వారా ఈ లిఫ్ట్ బలాన్ని పెంచవచ్చు. కిందకు లాగే బరువు పైకి లేపే లిఫ్ట్ సరి సమానంగా ఉంటే విమానం గాలిలో అక్కడే తేలుతుంటుంది. లిఫ్ట్ ఎక్కువైతే విమానం పైకి లేస్తుంది. తక్కువైతే కిందకు దిగుతుంది.
4) ఢ్రాగ్:
విమానం లోని ఇంజన్ , ప్రొఫెల్లర్లు గాలిని వేగంగా వెనక్కి నెడుతూ ఈ గుంజుడు బలాన్ని సృష్టిస్తాయి.
ఇదే సమయంలో ఆ ఎదురు గాలి సృష్టించే అవరోధం నాలుగోది. అదే డ్రాగ్. ఈ డ్రాగ్ కంటే కూడా దాన్ని ముందుకు లాగే బలం (థ్రస్ట్) ఎక్కువగా ఉంటేనే విమానం ముందుకు సాగిపోతుంది.
No comments:
Post a Comment