రోజూ సూర్యుడి కంటే ముందే నిద్రలేచి, మార్నింగ్
వాక్ చేస్తూ సన్‌రైజ్‌ను ఎంజాయ్ చేస్తారా?
లేక
పొద్దుపోయిందాకా పనిచేసి బారెడు పొద్దెక్కాకగానీ
లేవరా? ఏ కేటగిరీకి చెందినా.. మార్చి 9న మాత్రం సూర్యోదయాన్ని అస్సలు మిస్ కాకండి. బుధవారం తూర్పున ఓ అద్భుతం కనిపించబోతోంది. రోజూలా పూర్తిగా కాకుండా.. పాక్షికంగా ఉదయించే
సూర్యుడ్ని చూడబోతున్నారు మీరు! అవును. మార్చి
9న
సంభవించనున్న సంపూర్ణ సూర్యగ్రహణం తెలుగు
నేలపై నుంచి కూడా స్పష్టంగా చూడొచ్చు. కాకుంటే పొద్దున్నే
నిద్రలేవాలంతే!
తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాలకు ప్రారంభమయ్యే సంపూర్ణ సూర్యగ్రహణం ఉదయం 10 గంటల 5 నిమిషాలకు
పూర్తవుతుందని, పశ్చిమ, వాయవ్యరాష్ట్రాల్లో
తప్ప భారత్‌లోని అన్ని రాష్ట్రాల్లో సూర్యగ్రహణాన్ని
చూడొచ్చని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ సోమవారం
ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రహణానికి సంబంధించిన మరి కొన్ని ముఖ్యాంశాలివి..- ఉదయం 4:49కి గ్రహణం ప్రారంభం అవుతుంది.
- 5:47కు సూర్యుడు పూర్తిగా కనుమరుగవుతాడు.
- 9:08 గంటల వరకు.. అంటే 3 గంటల 61 నిమిషాలపాటు కనిపించడు.
- స్థానిక కాలమానం ప్రకారం ఈ వ్యవధి ఒక్కో ప్రాంతాన్ని బట్టి మారుతుంది.
- హైదరాబాద్‌లో ఉదయం 6:29 నుంచి 6:47 వరకు.. అంటే 18 నిమిషాలపాటు సూర్యగ్రహణాన్ని వీక్షించొచ్చు.
- నల్లగొండ జిల్లాలో 6:26 నుంచి 6:47వరకు (21 నిమిషాల పాటు) గ్రహణం కనిపిస్తుంది.
- కేంద్రపాలిత ప్రాంతమైన పోర్ట్ బ్లెయిర్‌లో 49 శాతం, భువనేశ్వర్ లో 24.5 శాతం, అగర్తలాలో 15, గువాహటిలో 11, కోల్‌కతాలో 18.5 శాతం గ్రహణం కనిపిస్తుంది.
- భారత్తోపాటు ఆగ్నేయ ఆసియా దేశాలైన థాయిలాండ్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, జపాన్ లలోనే కాక ఆస్ట్రేలియా, ఉత్తర ఫసిఫిక్ సముద్రప్రాంతంలోనూ గ్రహణం ఏర్పడుతుందని ఎర్త్ సైన్సెస్ శాఖ తెలిపింది.
- ఉదయమే ఏర్పడినా.. సూర్యగ్రహణాన్ని నేరుగా చూడవద్దని, అలాచూస్తే కళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెల్డింగ్ గ్లాస్, బ్లాక్ పాలిమర్, మైలార్ తదితర సాధనాల ద్వారా మాత్రమే సూర్యగ్రహణాన్ని దర్శించాలంటున్నారు.
- సూర్యగ్రహణం నేపథ్యంలో మార్చి 9న దేశంలోని ప్రధాన ఆలయాలన్నింటిని మూసివేసి, గ్రహణీ
No comments:
Post a Comment