Sunday, 14 February 2016

జాబ్ కోసం Top 10 సోషల్ మీడియా టిప్స్



1.కంపెనీ పేజిలు :
కనిపించిన ప్రతి పేజిని Like చేసుకుంటూ పోతాం..కాని వాటిలో ఉపయోగపడేది అతి కొద్ది పేజిలు మాత్రమే.
జాబ్ ఇంటర్వ్యూ లో మా కంపెనీ గురుంచి మీకు ఏమి తెలుసు అని కంపెనీ వారు  అడుగుతారు. అప్పుం ..పప్పుం అని గొంతులో మినరల్ వాటర్నమలటమే మన వంతు.
ఆ పరిస్థితి రాకుండా ….మన ఫీల్డ్ లో ఉన్న కంపెనీల సోషల్ మీడియా పేజిలు ఫాలో అయితే చాలా లాభం.

ఒకటి ఆ కంపెనీ గురుంచి ఎప్పుడు లేటెస్ట్ విషయాలు తెలుస్తాయి.
ఇంకోటి ఆ కంపెనీ పని తీరు బట్టి అవి ఎటువంటి ఉద్యోగస్తులను తీసుకుంటుందో అంచానాకి రావచ్చు.
అలానే ఆ కంపెనీలు ఓపెనింగ్ ఉన్నప్పుడు సోషల్ మీడియాపేజి లో పోస్ట్ చేస్తాయి.

2.జాబు కోసం వెతుకుతున్నారు అని తెలియాలి :
ఫేస్ బుక్ కావచ్చులింకేడిన్ కావచ్చుప్రతి సోషల్ నెట్వర్క్ లో మన ప్రొఫైల్ కి సంభందించి కొన్ని వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ క్రియేటివ్ చూపించి “Not Yet Working ” ” Dad is My Salary” లాంటి ఫన్నీ టైటిల్స్ పెట్టుకునే కంటే…. జాబ్ కోసం వెతుకుతున్న విషయం నలుగురికి తెలియజేయండి. మనం వెతుకుతున్న జాబ్ కి సంబంధించిన టైటిల్ ప్రొఫైల్ టైటిల్ గా పెట్టుకోండి.

ఎందుకంటే..మనకి తెలియకుండా మన సర్కిల్ లోనే జాబ్ ఇచ్చే వారు ఉండచ్చు, లేదా మన ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరయినా ఉండొచ్చు.కాబట్టి మన స్కిల్స్ తెలిసేలా మంచి ప్రొఫైల్ టైటిల్ పెట్టుకోండి.

ఉదాహరణకి :
“Trained Java for 6 Months In Institute …. ”
“Done Diploma in Photography”.
“Mechanical Engineer with  80% Looking for Opportunity”

3.ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫోటో :
మన సోషల్ మీడియా ఎకౌంటు లో ప్రొఫైల్ ఫోటో అనేది మంచి ప్రొఫెషనల్ ఫోటో పెట్టుకుంటే మంచిది. ఫోటో వెనక బ్యాక్ గ్రౌండ్ ప్లేన్ గా ఉంటె మంచిది.

ఫోటో స్టూడియో లో లేదా మంచి కెమెరా ఉంటె మన ఫ్రెండ్ సహాయం తీసుకొని దీగినా పర్లేదు. ప్రొఫైల్ పిక్ లో ఏమ్ముందిలే అని తేలిక వద్దు.మన కంటే ముందు మన మీద ఒక అభిప్రాయం ఆ ప్రొఫైల్ పిక్  కలగజేస్తుంది.

4.ఆలోచించి LIke..Share..Tweet చెయ్యండి.
మనం ఒక జాబ్ కి అప్లై చేసాక, ఈరోజుల్లో కంపెనీ వారు మన Resume కంటే ముందు మన సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తున్నారు. మనం LIke..Share  చేసే విషయాలు బట్టి,మన ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తున్నారు.

కాబట్టి మనం ప్రొఫైల్ లో షేర్ చేసే విషయాలు ఒకటికి రొండు సార్లు ఆలోచించి షేర్ చేస్తే మంచిది.

ఉదాహరణకి : మనం ఎక్కువగా సినిమాల గురుంచి లేదా పాలిటిక్స్ గురుంచి వచ్చే గాలి వార్తలు LIke ,Share చేస్తే మన ప్రొఫైల్ చూడగానే, కంపెనీ వారు ఈ ప్రొఫైల్ గల వ్యక్తి ఎక్కువగా Gossips కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రేపు టీం లో జాయిన్ అయితే టీం కి చాలా కష్టం అనిఒక అభిప్రాయానికి వస్తారు.

5.ప్రైవసీ సెట్టింగ్స్ :
మనం LIke ,షేర్ చేసే ప్రతిది బయట ప్రపంచానికి తెలియకుండా ప్రైవసీ సెట్టింగ్ లలో పబ్లిక్ బదులు కేవలం ఫ్రెండ్స్ లాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

అలానే ఇదివరకు మనం ఏదయినా ఇబ్బందికర విషయాలు షేర్ చేసినా..వాటికి కామెంట్ చేసినా..జాబ్ సేరచ్ లో ఉన్నపుడు వాటిని ప్రొఫైల్ నుండి డిలీట్ చేయటం ఉత్తమం.

6.ప్రొఫైల్  కవర్ ఫోటో :
ప్రతి సోషల్ మీడియా మంచి కవర్ ఫోటో పెట్టుకునే అవకాశం ఇస్తుంది.చాలా మంది ఫ్రెండ్స్ ని ఇంప్రెస్స్ చేయటానికి ఆ కవర్ ఫోటో పిక్ లో క్రియేటివిటీ చూపిస్తాము. ఇప్పుడు ఆ క్రియేటివిటీ జాబ్ తెచ్చుకోవటంలో చూపించ వచ్చు.

మనలో Graphic Designer,Artist,Photographer లాంటి వారు ఉంటె  స్కిల్స్ చూపించటానికి కవర్ ఫోటో బాగా ఉపయోగపడుతుంది.

అదే టెక్నికల్ లేదా ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టు వారు అయితే.. సబ్జెక్టు కి తగిన కవర్ ఫోటో క్రియేటివ్ గా ప్లాన్ చేసుకోండి.మన ఎక్స్పీరియన్స్ ….మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ లాంటి వాటితో సోషల్ మీడియా కవర్ పిక్ ప్లాన్ చెయ్యొచ్చు.

7.Resume లో సోషల్ మీడియా లింక్స్ :
మన Resumeలో లింకేడిన్ ప్రొఫైల్ లేదా ట్విట్టర్ ప్రొఫైల్ లింక్స్ పెట్టుకుంటే మంచిది. దీని ద్వారా మనం సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటున్నాము అని తెలియజేస్తున్నాము.అలానే మన ప్రొఫైల్ ద్వారా మనమేంటో వారికి తెలియజేయటానికి బయపడట్లేదు అని కుడా వారికి ఒక సందేశం ఇస్తున్నట్టే.

అయితే అలా చేసే ముందు …..పైన చెప్పిన పద్దతులు అని ఫాలో అవ్వండి.

8. జాబ్  గ్రూప్ లు  :
సోషల్ మీడియా లో గ్రౌప్స్ ఉంటాయి. అడ్డమయిన గ్రూప్ లలో చేరే బదులు ..మనం వెతికే జాబ్ సబ్జెక్టు కి సంభందించిన గ్రూప్ లలో జాయిన్ కావాలి .

అయితే గ్రూప్ లో జాయిన్ అయిపోగానే పని అయిపోదు. వాటిలో మన జాబ్ సబ్జెక్టు గురుంచి పోస్ట్లు షేర్ చేయటం..వాటి గురుంచి అప్ డేట్ గా ఉండటం చేస్తే మంచిది.

ఆ గ్రూప్లు ఎలా పట్టుకోవాలి అని అడగద్దు సినిమాలకి , కులాలకి , ప్రాంతాలకి, పొలిటికల్ పార్టీ లకి సంబంధించిన గ్రూప్లలో ఇప్పటికే చాలా మంది ఉండే ఉంటారు. అవి దొరికినప్పుడు జాబ్ కి ..కంపెనీలకి ..సబ్జెక్టు లకి సంబంధించిన గ్రూప్ లు ఎందుకు దొరకవు.

9.వినయంగా వివరంగా అడగాలి:
మనలో చాలా మంది సోషల్ మీడియా లో సీనియర్ల ని, పేరున్న వ్యక్తులకి మెసేజ్ చేసి ఏదయినా పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్ అడుగుతాము.
అయితే ఆ అడిగే దోరణిలో తేడా ఉంటుంది… ” హాయ్ ,నాకు జాబ్ కావాలి ఉందా అని మెసేజ్ పెడితే అది చదివిన వాడికి గ్యాస్ ప్రాబ్లం లేకుండానే మండుతుంది.

మనకేమి వారు అప్పు లేరు ….అది వారి బాధ్యత కాదు.అందుకే అడిగే వీధానంలో పద్ధతి పాటిస్తే..ఈ రోజు వారి దగ్గర అవకాశం లేకపోయినా, భవిష్యత్తులో ఉంటె మనకి చెప్పే ఛాన్స్ ఉంది.

బయటే కాదు సోషల్ మీడియా లో కుడా వినయంగా ఉండాలి.

10.ప్రొఫైల్ లో ప్రొఫెషనల్ వివరాలు :
ప్రతి సోషల్ మీడియా లో మన ఎడ్యుకేషన్ మరియు ఇతర వివరాలు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది.
అలానే మన గురుంచి చెప్పుకునే “About Me ” లాంటి fields ఉంటాయి. ఇక్కడ మన ఎక్స్పీరియన్స్ లేదా మనకి సబ్జెక్టు మీద ఉన్న పట్టుసబ్జెక్టు మీద మన ఐడియా గురుంచి రాసుకోవచ్చు.

మీ సోషల్ మీడియా ప్రొఫైల్ అనేది ఈ తరం Resume అని మర్చిపోకండి.
 
BEST LOGIC COMPUTER EDUCATION

No comments:

Post a Comment